Published: 02-05-2018

బీజేపీలో చేరనున్నటిడిపి నేత వై సుజనా చౌదరి

న్యూఢిల్లీః కేంద్ర మాజీ మంత్రి, టిడిపి నేత వై సుజనా చౌదరి బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. టీడీపీ వర్గాల్లో సంచలనం కలిగించి, చర్చోపచర్చలకు దారితీసిన ఈ వార్తను ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. 2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలను, నిధుల సేకరణ కార్యక్రమాలను సుజనా చౌదరి పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఎంపీగా ఉన్న ఆయన్ను తన మంత్రివర్గంలోకి నరేంద్ర మోదీ ఆహ్వానించారు కూడా. నాలుగేళ్ల తరువాత, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలతో సుజనా చౌదరి చర్చించారని, ఆయన త్వరలోనే పార్టీ మారనున్నారని నేడు పబ్లిష్ అయిన వార్త కలకలం రేపుతోంది.