Published: 30-04-2018
సిఈవో చందా కొచ్చర్‌కు మరో ఝలక్

ముంబాయి: ఐసిఐసిఐ బ్యాంక్ సిఈవో చందా కొచ్చర్‌కు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ మరో షాక్. ఐటీ శాఖ నుంచి చందాకొచ్చర్‌కు నోటీసు జారీ చేసింది. ఆమె భర్త వ్యక్తిగత ఆదాయ వివరాలు ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. 15రోజుల్లో వివరాలు సమర్పించాలని ఐటీశాఖ తన ఆదేశాల్లో ప్రస్తావించింది.
