Published: 29-08-2019
భారత్, పాకిస్తాన్ యుద్ధంలో.... చైనా పాక్ వైపు

క్టోబరు లేదా నవంబరులో భారత్, పాకిస్థాన్ భీకర యుద్ధానికి దిగుతాయని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అంచనా వేశారు. భారత్‌తో ఇదే ఆఖరి యుద్ధం అవుతుందన్నారు. ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు జరుగుతాయని భావించేవాళ్లు ‘ఫూల్స్’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్ విషయంలో పాక్ పక్షానే చైనా ఉంటుందని రావల్పిండిలో బుధవారం చెప్పారు. కశ్మీరు అంశాన్ని ఐక్యరాజ్యసమతి భద్రతా మండలి నిజంగానే పరిష్కరించాలనుకుంటే ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఉండేదని అహ్మద్ అన్నారు. ఐరాసలో సెప్టెంబరు 27న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసే ప్రసంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. కశ్మీరు అంశాన్ని పరిష్కరించకపోతే భారత్, పాకిస్థాన్ మధ్య ‘న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్’ అవుతుందని ఇమ్రాన్‌కు వంత పాడారు.
