ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ప్రారంభం

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించింది. అమెరికాకు వెలుపల అమెజాన్‌కు ఇదే సొంత కార్యాలయ భవనం. అంతేకాక కంపెనీకి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం కూడా. 9.5 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాప్‌సలో 15,000 మందికి పైగా ఉద్యోగులు పని చేయొచ్చు. 18 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఈ కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది. క్యాంప్‌సను తెలంగాణ హోమ్, జైళ్లు, ఫైర్ సర్వీసెస్ మంత్రి మహమూద్ మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యాలయం బిల్డ్ ఆప్ ఏరియా దాదాపు 65 ఫుట్‌బాల్ కోర్టులతో సమానం. బరువు పరంగా ఈఫిల్ టవర్ నిర్మాణానికి వినియోగించిన స్టీల్ కంటే 2.5 రెట్ల ఎక్కువగా స్టీల్‌ను ఈ భవన నిర్మాణానికి వినియోగించారు. 86 మీటర్ల పొడవైన భవనంలో మొత్తం అత్యాధునికమైన 49 ఎలివేటర్లు ఉన్నాయి. సెకనులో ఒక ఫ్లోర్‌ను ఎక్కేయొచ్చు. ఉద్యోగులు తమ అవసరాలకు అనుగుణమైన పని చేయడానికి వివిధ రకాల వర్క్ స్పేస్‌లు, ప్రాఽర్థన గదులు, మథర్ రూమ్‌లు, షవర్లు, క్విట్ రూమ్‌లు హెలిప్యాడ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. 2016, మార్చి 30న క్యాపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రోజుకు సగటున 2,000 మంది కార్మికులు నిర్మాణంలో పాల్గొన్నారని అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ వైస్ ప్రెసిడెంట్ జాన్ షెట్లర్ అన్నారు. నిర్మాణానికి 39 నెలలు పట్టిందని, 1.8 కోట్ల మ్యాన్ అవర్స్ సమయంలో నిర్మించారని జాన్ వివరించారు. తెలంగాణలో పెట్టుబడుల అనుకూల వాతావరణం ఉండడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. క్యాంపస్ ప్రాంగణంలో 300 మొక్కలను, 200 ఏళ్లకు పైబడిన మూడు చెట్లను నాటారు. 8.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి (వాటర్ రీసైక్లింగ్) ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. భారత్‌లో దీర్ఘకాల పెట్టుబడులకు, కార్యకలాపాల విస్తరణకు అమెజాన్ కట్టుబడి ఉందని చెప్పడానికి హైదరాబాద్‌లోని అతిపెద్ద క్యాంపస్ నిదర్శనమని జాన్ అన్నారు.
