మళ్లీ వేలం విధానంలో బిడ్‌లకు ఆహ్వానం

పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చే సంస్థల్లో తక్కువ ధరకు చేసే సంస్థకు అప్పగిస్తారు. వేలం తరహాలో ఇది ఉంటుంది.
కాంట్రాక్టు సంస్థల క్వాలిఫికేషన్.. 2003 జూలై 1న విడుదల చేసిన జీవో 94కి లోబడి ఉంటుంది.
సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోనే రిజిస్టర్ చేసుకుని ఉండాలన్న నిబంధనను ఈ ఉత్తర్వు ద్వారా సడలించారు. ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్, ఒప్పందాలు చేసుకుని కాంట్రాక్టు పనులకు ముందుకు రావచ్చు. పోటీ ఎక్కువగా ఉండేందుకు వీలుగానే రాష్ట్రంలోనే రిజిస్ర్టేషన్ చేసుకుని ఉండాలన్న నిబంధననను సడలించారు.
సరిపోయేంతలా బిడ్ రాకుంటే.. పనులను విడదీసి మళ్లీ బిడ్‌లను వేలం విధానంలో పిలుస్తారు.
కాంట్రాక్టు సంస్థను తప్పించిన సమయంలో మిగిలిన ఉన్న పనులకు గాను రివర్స్ టెండర్ కమ్ ఆక్షన్‌ను పిలుస్తారు. ఈ పనుల అనుభవం ఆధారంగా టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తారు.
బిడ్డర్లు తమ అనుభవాన్ని సామర్థ్యాన్ని గురించి స్వీయ డిక్లరేషన్ ఇవ్వాలి.
ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానం ప్రక్షాళన.
ఆర్థిక, సాంకేతిక క్వాలిఫికేషన్లను కూడా పూర్తిస్థాయిలో విశ్లేషించాకే.. అర్హతను నిర్ధారిస్తారు. ప్రీక్వాలిఫికేషన్ బిడ్డర్లు తమ అనుభవం, నైపుణ్యం, సామర్థ్యం, ఆర్థిక స్థోమత తదితర ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. వాటిపై సంతృప్తి చెందాకే ప్రీక్వాలిఫికేషన్ ఆమోదం లభిస్తుంది.
ఎల్-1ను బిడ్ ధరగా నిర్ధారిస్తారు. నోటిఫికేషన్ జారీ చేసిన మూడు గంటల నుంచి బిడ్డింగ్ ప్రక్రియ మొదలవుతుంది. బిడ్‌ల మధ్య అంతరం 0.5 శాతం ఉండాలి. ఎల్-1 బిడ్డర్ తనకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లను 24 గంటల్లోగా అందజేయాలి.
