Published: 17-08-2019

జనసేనను విలీనం చేసే ప్రసక్తే లేదు

‘‘జనసేన పార్టీ జాతి కోసం ఆవిర్భవించిం ది. ఏ జాతీయ పార్టీ తన తలపై తుపాకులు పెట్టినా జనసేనను విలీనం చేసే ప్ర సక్తే లేదు. ఈ విషయాన్ని పార్టీ మాటగా ముందుకు తీసుకువెళ్లండి’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కార్యకర్తలకు స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో విజయవాడ, మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో, టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల కోసం, మరో పార్టీ తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చుకుని సీఎం అవ్వాలన్న లక్ష్యాలతో ఆవిర్భవించిందన్నారు. జనసేన అన్ని ప్రాంతీయ పార్టీల్లాంటి ది కాదన్నారు. రాజకీయాల్లో ఉండేవారికి మాట మీద నియంత్రణ ఉండాలన్నారు.
 
నోటికి వచ్చింది మాట్లాడి సోషల్‌ మీడియాని దుర్వినియోగం చేయవద్దని కోరారు. ‘‘కృష్ణానది వరదలపై ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదన్న అంశం నా దృష్టికి వచ్చింది. బాధితులకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. జనసైనికు లు బాధితులకి మీ వంతు సాయం చేయండి.’’ అని పవన్‌ పిలుపునిచ్చారు. ఓట మి తనకు బాధ కలిగించడం లేదని ఎవరూ అనుకోవద్దని కోరారు. ఓటమి వద్దే నిలిచిపోవాలని అనుకోవడం లేదన్నారు. తనపై ఉన్న ప్రేమతో బందీని చేయవద్ద ని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పార్టీని నడపడానికి వేలకోట్లు అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యాలయాలు పెట్టే శక్తి లేదనీ, చెట్ల కింద అరుగుల మీద సమావేశాలు ఏర్పాటు చేయండని ఆయన కార్యకర్తలకు పి లుపునిచ్చారు. జనసైనికులు ఒక్కొక్కరు, ఒక్కో రూపాయి తీసినా చాలా అవసరా లు తీరుతాయన్నారు. ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే చెప్పే చేస్తానన్నారు. మేనిఫెస్టోలో ఒకటి చెప్పి, అలా చెప్పలేదు అనే వంకరటింకర రాజకీయాలు తాను చేయనన్నారు.