Published: 06-08-2019

ఆర్టికల్‌ 370 రద్దు కాలేదు

 ఆర్టికల్‌ 370ను కేంద్రం రద్దు చేయలేదని, అందులోని 35ఏ వంటి నిబంధనలను మాత్రమే రద్దు చేసిందని మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే తెలిపారు. సోమవారం ఆయన సుప్రీంకోర్టులో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్‌ 370 సెక్షన్‌ 3 జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడమే కాదు, ఆ హోదాను ఏ సమయంలోనైనా ఒక ఉత్తర్వుతో రద్దుచేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చిందని తెలిపారు. ఈ నిబంధన ద్వారానే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి ఉత్తర్వును కేంద్రం తెచ్చుకోగలిగిందని వివరించారు. రాజ్యాంగంలోని నిబంధనలను కేంద్రం పూర్తిగా వినియోగించిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ విభజనకు 2, 3 అధికరణలను ఉపయోగించుకుందంటూ ఈ ప్రక్రియను ‘పెద్ద సర్జరీ’గా ఆయన అభివర్ణించారు.