Published: 27-07-2019
విధులు గాలికొదిలేసి శక్తి టీమ్స్

ఉద్యోగాలు ఊడుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నప్పటికీ ప్రభుత్వోద్యోగులు మాత్రం టిక్‌టాక్‌ను వదలడం లేదు. రాత్రికి రాత్రి సెలబ్రిటీలు అయిపోవాలన్న ఆకాంక్షతో విధుల్లో ఉండగానే టిక్‌టాక్ చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ జాడ్యం తాజాగా ఏపీలోని శక్తి టీమ్స్‌కు కూడా అంటుకుంది. టిక్‌టాక్ మోజులో పడి శక్తి టీమ్స్ విధులను గాలికొదిలేశాయన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.
పంచ్ డైలాగ్‌లతో టిక్‌టాక్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. జబర్దస్త్ పంచులతో కామెడీ పండిస్తూ లేడీ కానిస్టేబుల్స్ చేస్తున్న టిక్‌టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసు వాహనంలోనే టిక్‌టాక్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టిక్‌టాక్ వీడియోలను స్టేటస్‌లో పెట్టుకుని తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో రక్షణను గాలికొదిలేశారంటూ మహిళా ఖాకీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
