Published: 05-07-2019
టీటీడీ జేఈవోగా బసంత్ బాధ్యతల స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తిరుపతి జేఈవోగా పి.బసంత్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బసంత్‌కుమార్ ముందుగా శ్రీవారిని దర్శించుకుని, రంగనాయక మండపంలో టీటీడీ ఆర్థిక శాఖాధికారి బాలాజీ నుంచి తిరుపతి జేఈవోగా ఫైల్‌పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తిరుమల ఇన్‌చార్జ్ జేఈవోగా పూర్తి అదనపు బాధ్యతలను బసంత్‌కుమార్‌కు అప్పగించారు. ఆతర్వాత ఆలయంలోని వేదపండితులు నూతన జేఈవోకు ఆశ్వీచనం పలికారు. ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్ శ్రీవారి చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందజేశారు. అక్కడినుంచి జేఈవో బసంత్‌కుమార్ దంపతులు అఖిలాండం వద్దకు చేరుకుని, పెద్ద జీయర్‌స్వామి వద్ద ఆశీస్సులు తీసుకున్నారు.
తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు పెంచటమే తన మొదటి ప్రాధాన్యతని బసంత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. జన్మజన్మల పుణ్యఫలంగా ఈ మహదవకాశం తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన ఇవ్వటం తన రెండోప్రాధాన్యతగా తెలిపారు. టీటీడీలో ఎలాంటి ఆరోపణలు వచ్చినా లోతుగా దర్యాప్తు చేసి నిజమని తేలితే చర్యలు తీసుకునేందుకు ఏ ప్రభుత్వం వెనుకాడదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. లాంగ్‌స్టాండింగ్ ఉద్యోగుల విషయంలోనూ ప్రభుత్వానికి విఽధివిధానాలు ఉన్నాయని, వాటిని అనుసరించి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
