Published: 05-07-2019
వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ బృందం విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. నాలుగు రోజులుగా విచారణలు ముమ్మరంగా సాగిస్తున్నా రు. వివేకా హత్య సమయంలో అప్పటి సిట్ బృందం విచారించిన వారందరినీ ఒక్కొక్కరి గా పిలిచి విచారిస్తున్నారు. అందులో భాగంగానే పులివెందులలో రౌడీషీటర్, రంగేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దిద్దెకుంట శేఖర్‌రెడ్డిని గురువారం పోలీసులు విచారించారు. అలాగే శేఖర్‌రెడ్డికి నార్కో అనాలసిస్, పాలిగ్రామ్, బీప్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని సిట్ బృందం పులివెందుల సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జడ్జి కిషోర్‌కుమార్ పరీక్షలకు అనుమతి ఇచ్చారు. దీంతో సిట్ బృందం శేఖర్‌రెడ్డిని కూడా హైదరాబాద్‌కు తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం వాచ్‌మెన్ రంగయ్యకు నార్కో అనాలసిస్ తదితర పరీక్ష లు నిర్వహించేందుకు సిట్ బృందం రంగయ్య ను హైదరాబాద్‌కు తరలించింది. పులివెందు ల కోర్టు అనుమతి ఇచ్చిన వెంటనే రంగయ్య ను బుధవారం రాత్రే సిట్ బృందంలోని కొందరు పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. గురువారం శేఖర్‌రెడ్డికి కూడా నార్కో అనాలసిస్ పరీక్షలకు కోర్టు అనుమతి లభించినా హైదరాబాద్‌కు ఇంకా తరలించలేదు. నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు హైదరాబాద్ నుంచి ఇక్కడి పోలీసులకు అనుమతి రానట్లు సమాచారం. దీంతో సిట్ బృందం పిలిచినప్పు డు తమ వద్దకు రావాలని శేఖర్‌రెడ్డికి చెప్పి ఇంటికి పంపించారు. గురువారం పలు కాల్‌డే టా ప్రకారం సిట్ బృందంలోని పోలీసులు పలువురిని ఫోన్ల ద్వారా విచారించినట్లు తెలిసింది.
