Published: 25-06-2019
నా కమిట్‌మెంట్ నాకుంది

తాను పార్టీని నడపలేనని ఒక్క రోజులో ఎలా నిర్ణయిస్తారని జనసే న అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మొక్క ఒ క్క రోజులో ఎదగదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మందైతే విలవిల్లాడిపోతారని.. తాము ధైర్యంగా కూ ర్చొని, బలంగా మాట్లాడి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్చిస్తున్నామని తెలిపారు. ఇంతకంటే చిత్తశుద్ధి ఎక్కడుంటందని ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నా కమిట్‌మెం ట్ నాకుంది. ప్రజలకు అండగా ఉంటాం. జనసేనను క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసేందుకు ఇదే అనువైన స మయం. బలమైన వ్యక్తులు, వ్యక్తిత్వం ఉన్న నాయకు లు మా పార్టీలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితా లు వచ్చి నెల రోజులే అయింది. కేడర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నికల తర్వాత పార్టీ కోసం బలంగా నిలబడిన నాయకులతో కమిటీలను ఏర్పాటు చేస్తు న్నాం. రెండు రోజుల నుంచి దీనిపై చర్చిస్తున్నాం’ అని తెలిపారు. రాజకీయ వ్యవహారాల కమిటీ, సమన్వయ కమిటీ, స్థానిక ఎన్నికల కమిటీ సహా తొలుతగా ఏడు కమిటీలకు ఆయన చైర్మన్లను ప్రకటించారు. మొత్తం గా 18 నుంచి 20 కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు.
నేను ఆశయాలను నమ్ముకున్నాను. గతంలో టీడీపీకి సపో ర్టు చేశాను. అందుకే ఆ పార్టీని ప్రశ్నించడానికి, వారి పై పోరాటం చేయడానికి బలమైన నైతిక హక్కు లభించింది. టీడీపీ తప్పులను ఎత్తి చూపడానికి చాలా సమయం తీసుకున్నాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎ లా పని చేస్తుంది, ఎలాంటి పాలన సాగిస్తుంది, పాలసీలు ఎలా ఉంటాయన్న వాటిని దృష్టిలో పెట్టుకుని ఏడాది వేచి చూస్తాం. ఏపీ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఏ పద్ధతిన ఈ నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి’ అని కోరారు. తాను విజయవాడ వస్తున్న సమయంలో ప్రజలు వారి గ్రామాల్లో సమస్యలను తన దృష్టికి తెస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయాన్ని అందరూ మ రచిపోయిన సమయంలో, హోదాకు తాము అనుకూలంగా ఉంటామని మాయావతి ప్రకటించారని పవన్ గుర్తుచేశారు. అందుకే తాము బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. టీడీపీ పదిసార్లు మాటలు మార్చిందని గుర్తుచేశారు. హోదాకు జనసేన ఇంకా కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల తర్వాత వామపక్షాలతో భేటీ జరగలేదని, తామైతే ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించామన్నారు. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అక్రమ నిర్మాణాలన్నిటినీ కూల్చాలని పవన్ స్పష్టం చేశారు. ఒక్కదానికే అమలు చేసి, మిగిలిన వాటిని వదిలేస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందన్నారు. జనసేనలో చేరే వారిని స్వాగతిస్తున్నామన్నారు.
రాష్ట్ర స్థానిక ఎన్నికల కమిటీ చైర్మన్‌గా తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌రావును నియమించారు. మైనారిటీల కమిటీ చైర్మన్‌గా అర్హం ఖాన్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా అప్పికట్ల భరత్ భూషణ్, మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్‌గా రేఖాగౌడ్, రాష్ట్ర నిర్వహణ కమిటీ చైర్మన్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ చైర్మన్‌గా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా చింతల పార్థసారథి నియమితులయ్యారు.
