Published: 23-06-2019
జనసైనికులతో పవన్ సమావేశాలు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేటి (ఆదివారం) నుంచి తమ పార్టీ నేతలతో సమావేశాలు జరపనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికల గురించి ఆయన కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారని సమాచారం. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో వలసల కాలం నడుస్తుండడంతో పార్టీ మారుతున్న నేతలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించే విషయాలను కూడా ప్రస్తావించనున్నారని తెలిసింది.
