Published: 18-06-2019
ఇసుకపై ఏపీ సర్కారు ప్రాథమిక నిర్ణయం

ఇసుకపై తెలంగాణలో అమలవుతున్న విధానాన్నే ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలో ఆ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక అమ్మకాలు నిర్వహిస్తోంది. దీనికోసం ఒక ప్రత్యేక ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఇసుకను తోలి...అక్కడి నుంచి వినియోగదారులకు అమ్ముతోంది. క్యూబిక్ మీటరు చొప్పున ధర, అదే సమయంలో రవాణా చార్జీలను వసూలు చేస్తోంది. ఏపీలో నూతన ఇసుక విధానంపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం...దానిపై సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఐదుగురు మంత్రులు, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(మైనింగ్), బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(ఆర్థిక), మేకతోటి సుచరిత(హోం), అనిల్‌కుమార్ యాదవ్(జలవనరులు), పిల్లి సుభా్‌షచంద్రబో్‌స(రెవెన్యూ) హాజరయ్యారు.
ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు మన్మోహన్‌సింగ్, ఆదిత్యనాథ్ దాస్, శ్రీనివాస శ్రీనరేశ్ తదితరులతోపాటు తెలంగాణ మైనింగ్ శాఖ అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని, అందులోని ప్రయోజనాలు, సమకూరుతున్న ఆదాయం తదితరాలపై తెలంగాణ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిపై ఏపీ మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు. అవసరమైతే ఆ విధానానికి అదనంగా కొన్ని అంశాలు చేర్చి అమలుచేయాలనే అభిప్రాయానికి వచ్చారని తెలిసింది. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని విధానాలనూ పరిశీలించారు. తెలంగాణ విధానాన్ని ప్రాథమికంగా తీసుకుంటూ...ఆయా రాష్ట్రాల్లో ఇంకా ఏమైనా మంచి అంశాలు, అదేవిధంగా మన రాష్ట్రానికి తగినట్లుగా నూతన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. దీనిపై త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి నివేదించి...తుది నిర్ణయం తీసుకుంటారు.
