Published: 07-06-2019

మంత్రివర్గ ఏర్పాటులో ఊహించని ట్విస్ట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు జగన్ సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం వైసీపీఎల్పీ  సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఈ ఐదుగురిలో వైసీపీ సీనియర్ నేత, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారు కాగా.. మిగిలిన నలుగురు ఎవరనేది తెలియాల్సి ఉంది.
కాగా.. ఇంతవరకూ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సాహసం చేయలేదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి మించి ఇంతవరకూ డిప్యూటీ సీఎంలుగా నియమించిన దాఖలాల్లేవ్. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇది నిజంగానే జగన్ సాహసోపేత నిర్ణయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మొత్తం 25 మంది మంత్రులతో జగన్ పూర్తిస్థాయి కేబినెట్‌ ఉండనుంది.