Published: 25-05-2019

పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు

వైసీపీ విజయంతో ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. ప లుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి. కొన్నిచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. నగరంలో వైసీపీ నాయకులు టీడీపీ వర్గీయుల ఇంటిపై దాడిచేశారు. కుర్చీలు, తలుపులపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. బాధితులు తెలిపిన వివరా ల మేరకు... నగరంలోని కృపానందనగర్‌లో డిప్యూటి మేయర్‌ సాకే గంపన్న సోదరుడి కు మారుడు సాకే చంద్రమోహన్‌ ఇంటిపై వైసీపీకి చెందిన చంద్రశేఖర్‌, సురేంద్ర, తిక్కసా యి, చిట్టి, వడ్డే నవీన్‌ శుక్రవారం రాత్రి తా గిన మత్తులో దాడికి దిగారు. దీంతో ఇరువురిమధ్య వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. వైసీపీ నాయకులు రాళ్లతో ఇంటి ముందున్న కుర్చీలను, సరుకులను, ఇంట్లోని కూలర్‌, ఫ్రిజ్‌ను ధ్వంసం చేసి దాడికి దిగారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. టూ టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకులు ఇంటిపైకొచ్చి దాడిచేయడంతోపాటు తమపై అసభ్య పదజాలంతో దూషించారని బాధితు లు ఆవేదన వ్యక్తంచేశారు. ఘటనపై టూ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.