Published: 07-05-2019

వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు

యాభై శాతం ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంతి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ అంశంపై 22 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం బిజీబిజీగా ఉన్నారు. ఏపీ భవన్‌లో చంద్రబాబుతో ఫరూక్‌ అబ్దుల్లా భేటీ అయ్యారు. వీవీప్యాట్ల అంశంపై చంద్రబాబు, ఫరూక్‌ అబ్దుల్లా మధ్య చర్చ జరుగుతోంది.
 
సుప్రీంకోర్టులో వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు రివ్యూ పిటిషన్‌ విచారణకు చంద్రబాబు, ఫరూక్‌ అబ్దుల్లా, ఇతర పార్టీ నేతలు హాజరుకానున్నారు. కాగా.. 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని, భారీగా అదనపు సిబ్బంది అవసరమని సుప్రీంకోర్టుకు ఈసీ వినిపించిన వాదనను చంద్రబాబు తప్పుపట్టారు. సోమవారం రాత్రి ఆయన ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి లేఖ రాసిన విషయం తెలిసిందే.