Published: 04-05-2019
‘ఫణి’ బాధితుల కోసం ప్రత్యేక యాప్

‘ఫణి’ తుఫాను బాధితులను ఆదుకునేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోస్తాలో తుఫాన్ ధాటికి ఆస్తి, పంట నష్టం వాటిల్లే సూచనలుండటంతో బాధితులకు తక్షణ పరిహారం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బాధితులు తమకు వాటిల్లిన నష్టం మదింపు వేయడానికి అధికారుల కోసం ఎదురు చూడకుండా, వారే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఆర్టీజీఎస్ ఏర్పాట్లు చేసింది. దీనికిగాను పీపుల్ ఫస్ట్ యాప్‌లో ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. తుఫాను ప్రభావితప్రాంతంలో ప్రజలు తమకు వాటిల్లిన నష్టం తాలూకు చిత్రాలను సెల్ ఫోన్ ద్వారా ఫొటో తీసి ఈ యాప్‌లో పొందుపరిస్తే.. ఈ ఫోటోలను ఆర్టీజీఎస్ క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సంబంధిత విభాగాలకు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి అధికారులకు పంపుతుంది. ఈ ఫొటోల ఆధారంగా వారు తక్షణం దానికి సంబంధించిన నష్టాన్ని మదింపు చేస్తారు. అనంతరం నష్టం తాలూకు పరిహారాన్ని నేరుగా బాధితులు, రైతుల ఖాతాలోకే జమ చేస్తారు.
గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి పీపుల్ ఫస్ట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌లో ఆధార్ నంబర్, గ్రామం, మండలం, జిల్లా వివరాలను నమోదు చేసి, ఫిర్యాదును పేర్కొనాలి. పొలం సర్వే నెంబరు, పంట, జరిగిన నష్టం వివరాలు తెలపాలి. నష్టం తాలూకు చిత్రాలను యాప్‌లో అప్‌లోడు చేయాలి.
పీపుల్ ఫస్ట్ యాప్‌ను https://bit.ly/2cpnr25 లింక్ ద్వారా లేదా “http://prajasadhikarasurvey.ap.gov.in/Fani/ index, html లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫణి తుఫాన్ వల్ల మీకు జరిగిన నష్టానికి సంబంధించి అర్జీలను కైజాల్చఞఛిఝ కనెక్ట్ http://bit.ly/2urm3ta ద్వారా కానీ, ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లో కానీ https://www.rtgs.ap.gov.in పీపుల్ ఫస్ట్ యాప్ http://bit.ly/2gsfwjh ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఫణి తుఫాన్ డాష్‌బోర్డును http://bit.ly/ 2vctdo8 లింక్ ద్వారా చూడవచ్చు.
పీపుల్ ఫస్ట్ యాప్‌కు బాధితులు పంపిన చిత్రాలను ఆర్టీజీఎస్ క్రౌడ్ సోర్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేసింది. మ్యాప్‌లో పంట నష్టం, కూలిన చెట్లు, దెబ్బతిన్న ఇళ్లు, తదితర 11 అంశాలను విభజించారు. ఎవరైనా సరే అందులోకి వెళ్లి అక్కడ క్లిక్ చేయగానే ఆ ప్రాంత ప్రజలు పంపిన చి త్రాలు, జరిగిన నష్టం తాలూకు వివరాలు స్పష్టంగా తెరమీద కనిపిస్తాయి. పీపుల్ ఫస్ట్ యాప్‌కు బాధితులు పంపిన చిత్రాలను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తక్షణం సంబంధిత విభాగాల మందింపు బృందాలు సకాలంలో వాటిని మదింపు చేస్తాయి. దాని ఆధారంగా బాధితులకు పరిహారం వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమచేసేలా చర్యలు తీసుకుంటారు. యాప్ డౌన్‌లోడు చేసుకోవడం, తుఫాన్ నష్టం చిత్రాలను పంపడంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, సందేహాలున్నా ప్రజలు వెంటనే పరిష్కారవేదిక 1100కు ఫోన్ చేయాలని ఆర్టీజీఎస్ విజ్ఞప్తి చేసింది.
