Published: 25-04-2019
ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన 3లక్షల 25 వేల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనికోసం సమాచార కేంద్రాల వద్ద, ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర లైన్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. బోర్డే స్వచ్ఛందంగా ఆ పని చేస్తుందని అధికారులు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు మే 15లోగా కొత్త మెమోలు జారీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు కట్టిన డబ్బులను రీఫండ్ చేస్తామని చెప్పింది. ముందు జాగ్రత్తగా ఫెయిలైన సబ్జెక్టులకు విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
