Published: 19-04-2019
ఒక సభలో మతం, మరో చోట కులం

ప్రధాని మోదీ కులం పేరుతో చేస్తున్న ఎన్నికల ప్రచారం దేశానికి మంచిది కాదు. ఒక సభలో మతం, మరో చోట కులం, ఇంకో దగ్గర ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు చేసే ప్రయత్నం ఆయన స్థాయికి తగదు. నాకు తెలిసి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తులెవరూ ఇలా మాట్లాడలేదు. ఎన్నికల్లో గెలిచేందుకు ఏ అస్త్రాన్నైనా ఉపయోగిస్తానని భావిస్తున్న మోదీ దేశ సమగ్రతకు తూట్లు పొడుస్తున్నారు.
