Published: 19-04-2019
ఇంజక్షన్‌లో వెంట్రుక ఉంది

ఇంజక్షన్‌లో వెంట్రుక ఉన్నట్లు గుర్తించటంతో 88 వేల లిడోకైన్ ఇంజక్షన్లను అమెరికా మార్కెట్ నుంచి అరబిందో ఫార్మా రీకాల్ చేయనుంది. లిడోకైన్ హెచ్‌సీఐ ఇంజక్షన్, యూఎ్‌సపీ 1 శాతం 50 ఎంజీ/5 ఎంఎల్ (19 ఎంజీ/ఎంఎల్)లో వెంట్రు క ఉన్నట్లు గుర్తించినట్లు అమెరికా ఆహార,ఔషధ నియంత్రణ మండలి (యూఎస్ ఎఫ్‌డీఏ) వెల్లడించింది. అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ అరోమెడిక్స్ ఫార్మా ఎల్‌ఎల్‌సీ కోసం భారత్‌లో ఈ ఇంజక్షన్లను ఉత్పత్తి చేసినట్లు యూఎస్ ఎఫ్‌డీఏ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒక లిడోకైన్ ఇంజక్షన్‌లో వెంట్రుక ఉన్నట్లు గుర్తించటంతో దీన్ని వెంటనే రీకాల్ చేయాలని అరబిందో ఫార్మాకు సూచించినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది.
కొన్ని సర్జరీలు, వైద్య సంబంధిత ప్రొసీజర్లలో స్థానిక లేదా రీజినల్ అనెస్తీషియా కోసం లిడోకైన్ హెచ్‌సీఐ ఇంజక్షన్‌ను ఉపయోగిస్తారు. మెక్సికో, యాష్‌బోరో, చార్లొట్టీ, నార్త్ కరోలినా, సాంటా థెరీసాలోని డిస్ట్రిబ్యూటర్ వద్ద ఈ ఇంజక్షన్లు ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా ఈ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో పంపిణీ చేయరాదని ఆదేశించినట్లు ఎఫ్‌డీఏ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కాగా ఇటీవలి కాలంలో వలస్ట్రాన్ టాబ్లెట్లలోని కొన్ని లాట్లలో మలినాలు గుర్తించటంతో అమెరికా మార్కెట్ నుంచి అరబిందో ఫార్మా వీటిని రీకాల్ చేసింది. అధిక రక్తపోటు నియంత్రణ, హార్ట్ ఫెయిల్యూర్‌లో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు.
