Published: 16-04-2019
ఇలాంటి ఫోన్‌కాల్ మీకు కూడా వచ్చిందా..?

మీ నియోజకవర్గం ఏది? మీరు ఏ పార్టీకి ఓటేశారు. మీతోపాటు మీ ఇంటిలో ఎంతమంది ఉంటారు? వారిలో ఎవరెవరు ఏఏ పార్టీలకు వేసి ఉంటారు? అసెంబ్లీకి, పార్లమెంటుకు క్రాస్ ఓటింగ్ ఏమైనా వేసి ఉంటారా?ఇదీ... పోలింగ్ తర్వాత ఓటర్లకు సర్వేల కోసం వస్తున్న ఫోన్‌ల తీరు. విరామం లేకుండా వినిపిస్తున్న ప్రశ్న ల వర్షంతో ఓటరు చెవులు వేడెక్కుతున్నాయి. రాష్ట్రం లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిముఖ పోటీ నేపధ్యంలో ఎవరి ఓట్లు ఎవరికి పడతా యో, మూడో పార్టీ ఎవరి ఓట్లు ఎంతవరకు చీల్చి ఉంటుంది? పసుపు కుంకుమ, అన్న దాత సుఖీభవ వంటి పఽథకాలు ఎంతవరకు పనిచేశాయనే అంశాల పై వీడని సందిగ్దత నెలకొనటంతో పార్టీలకూ ఓటరు నాడి అంతుచి క్కని విధంగా ఉంది. దీంతో సర్వేలు గందరగోళంగా వస్తున్నాయి. సాంఘి క మాద్యమాలు చూస్తేచాలు ఎవరికివారే సర్వే అంటూ కాకి లెక్కలు వేసేసి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశాలను నిర్ణయించేస్తున్నారు.
అయితే ప్రజలు వీటిలో ఏ సర్వేను నమ్మే పరిస్థితి లేకపోవటం, బెట్టింగ్ రాయుళ్లకు ఓటరు నాడి అర్ధంకాక ఎటు వైపు పందెం కాస్తే మేలు జరుగుతుందనే అంశాలను బేరీజు వేసుకోటానికి కూడా ఫోన్ సర్వేలపై ఆధారపడుతున్నారు. దీంతో రోజులో ఒక్కో ఓటరుకు నాలుగు నుంచి పది ఫోన్‌ల వరకు వస్తున్నాయి. ఓటరు ఉన్న పరిస్థితి, మాట్లాడగలడో లేదో కూడా చూడకుండానే ఫోన్ లిఫ్ట్‌చేసిన వెంటనే ప్రశ్నల దాడికి దిగిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో చాలామంది ఫోన్ వస్తుందంటే విసుగు చెందే పరిస్థితి ఏర్పడింది. ట్రూకాలర్‌లో పేరు పడినా, సంస్థ పేరు పడినా ఆ కాల్స్‌ను రిజెక్ట్ చేస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. అయితే వీటిలో సాధారణ ఫోన్ నంబర్‌ల తరహాలో ఉండటంతో వాటిని తప్పనిసరై మాట్లాడక త్పటంలేదని, సమాధానం ఇచ్చేందుకు ఆసక్తి లేదన్నా వదలటంలేదని, ఫోన్ కట్ చెయ్యాల్సి వస్తోందని రమణబాబు అనే ఫోన్ వినియోగదారుడు చెబుతున్నారు. ఇదిట్లా ఉంటే వీటి ఆధారంగా బెట్టింగ్‌లకు తెరలేపుతున్నవారూ ఉన్నారు.
ఇప్పటివరకు కొన్ని సర్వేలు తమ విధానాలకు అనుగుణంగా చేయటం, వాటిలో చాలావరకు గతంలో వచ్చిన ఫలితాలకు పోలిక ఉండకపోవటంతో వాటికి స్వస్థి చెబుతున్నారు. దీనికితోడు ఫలితాలు వెలువడటానికి ఇంకా నెలకుపైగా సమయం ఉండటంతో కొత్తగా ఫోన్ సర్వేలకు తెరలేపుతున్నారు. ప్రధానం గా ఓటరు ఎవరికి ఓటు వేశారనేదే కీలక ప్రశ్న అయితే, ఒక ఫోన్ కాల్‌తో సాధ్యమైనంత వరకు దక్కినంత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో ఓటర్లకు ఇబ్బందులు తప్పటంలేదు. ఒకరికి రోజుకు కనీసం నాలుగు ఫోన్‌లు వస్తుండటంతో ఇ బ్బంది పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఓపికగా ఎవరైనా సమాధానం చెబుతుంటే ఓటు వేసిన పార్టీ కి ఎందుకు వేశారనే సమాచారం కూడా రాబట్టటం, ఆ గ్రామంలోకానీ, వార్డులోకానీ ఎక్కువగా ఏ పార్టీకి వేశారనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
