Published: 30-03-2019
తిరుమలలో తగులబడుతున్న శేషాచలం అటవీప్రాంతం

తిరుమల: తిరుమలలో శేషాచలం అటవీప్రాంతంలో మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. బాకరాపేట రేంజ్‌లోని చామల అడవుల్లో గురువారం మొదలైన కార్చిచ్చు నలుదిశలా వ్యాపిస్తుంది. 24 గంటలుగా అగ్నికి అటవీప్రాంతం ఆహుతవుతున్నది. శనివారం ధర్మగిరి ప్రాంతంలోని గాడికోన వద్ద అటవీప్రాంతంలోకి మంటలు వ్యాపించాయి. శ్రీవారి పాదాల వద్ద రోడ్డుకు సమీపానికి మంటలు విస్తరిస్తున్నాయి. దగ్ధమవుతున్న అటవీప్రాంతం ప్రభుత్వ అధీనంలోని ప్రాంతమని టీటీడీ తెలిపింది.
