Published: 16-03-2019

వైఎస్ వివేకా అంతిమయాత్ర

 
కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. పులివెందులలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. వైఎస్ రాజారెడ్డి ఘాట్‌లో వివేకా అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా... ఈ అంతిమయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు, పులివెందుల పట్టణమేగాక జిల్లా వ్యాప్తంగాగల వైఎస్ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.