Published: 14-03-2019
తోట నరసింహంకు టీడీపీ కౌంటర్

ఏపీలో రాజకీయం వేడెక్కిస్తోంది. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు వలసలు కొనసాగుతున్నాయి. ఎంపీ తోట నరసింహం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సతీమణి వాణితో కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీలో అవమానించారని అందుకే పార్టీ మారుతున్నానని తోట నరసింహం చెప్పుకొచ్చారు. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు టీడీపీ కనీసం పరామర్శించలేదని తోట నరసింహం విమర్శలు చేశారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పేర్కొన్నారు. అందుకే పార్టీని వీడుతున్నానని వెల్లడించారు. అయితే తోట నరసింహం వ్యాఖ్యలకు కౌంటర్‌గా టీడీపీ ఫోటోలు విడుదల చేసింది. తోట నరసింహం ఆసుపత్రిలో ఉన్నప్పుడు లోకేశ్ పరామర్శించి ఫోటోలను విడుదల చేసింది. ఆ సమయంలో లోకేశ్‌తో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.
