Published: 11-03-2019

ఆదిత్యుడ్ని తాకిన సూర్యకిరణాలు

అరసవల్లి : శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి ఆదిత్యుడ్ని ఆదివారం సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చి 9, 10 తేదీల్లో ఆలయంలోని మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకుతుంటాయి. ఈ క్రమంలో శనివారం నిరాశ పరిచినా.. ఆదివారం ఉదయం 6.20 గంటల నుంచి 6.30 గంటల వరకు మూలవిరాట్‌ను సూర్యకిరణాలు స్పృశించాయి. తొలి సంధ్యవేళలో గాలిగోపురం మధ్యలో నుంచి ధ్వజస్తంభాన్ని తాకుతూ మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకడం చూసి.. భక్తులు పులకించారు.