ఒక్కసారి సీఎంగా అవకాశం ఇవ్వండి

ముఖ్యమంత్రి గా తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. అధికారంలో రాగానే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను చెప్పారు. మంగళవారం రాత్రి గుంటూరుజిల్లా నరసరావుపేటలో ని పల్నాడు రోడ్డులో జరిగిన సభలో పవన్ ప్రసంగించారు. అంతకుముందు ప్రకాశంజిల్లా కేంద్రం ఒంగోలు లో జనసేన కార్యకర్తలతోనూ, విద్యార్థులతోనూ సమావేశమై మాట్లాడారు. ‘పల్నాడులో అడ్డగోలుగా వనరులను దోపిడీ చేశారు. రూ.320 కోట్ల విలువైన అక్రమ మైనింగ్ జరిగి ప్రభుత్వ ఖజానాకు గండి పడితే అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. జీఎస్టీ, ఇత ర ప్రభుత్వ ట్యాక్స్‌లతో పాటు కొడుకుల ట్యాక్స్‌లు కూ డా ఈ ప్రాంతంలో అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎం పీ పదవులు కుటుంబాల వారీగా పంచుకుంటున్నారు, ఇలాంటి విధానాలకు జనసేన స్వస్తి చెప్తుంది. టీడీపీ, వైసీపీ, టీఆర్‌ఎ్‌సలకు దూరం పాటిస్తాం. ప్రజలందరికీ న్యాయం చేయటం, మా ప్రధాన అజెండా’ అన్నారు.
