భారత హ్యాకర్లకు భయపడే పాక్ చర్యలు

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్‌కు ‘సైబర్’ భయం పట్టుకుంది. ఎక్కడ తమ ప్రభుత్వ వెబ్‌సైట్లపై భారతీయ హ్యాకర్లు దాడిచేస్తారోననే భయంతో బుధవారం నుంచి పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధానంగా.. పాక్ ఆర్మీ వెబ్‌సైట్ www.pakistanarmy.gov.pk ను భారతీయులు యాక్సెస్ చేయకుండా నిలువరించింది. ఆ వెబ్‌సైట్‌ను సందర్శించాలనుకునేవారికి ‘మీ దేశంలో ఈ వెబ్‌సైట్ యాక్సె్‌సపై నిషేధం ఉంది’ అనే సందేశం వస్తోంది. అదేవిధంగా పాక్ నేవీ, ఎయిర్‌ఫోర్స్, రక్షణ శాఖ పౌరసంబంధాల విభాగం ఐఎఎ్‌సపీఆర్ (ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్) వెబ్‌సైట్లను తమ సొంత సర్వర్ నుంచి తప్పించి, ప్రఖ్యాత క్లౌడ్ సేవల సంస్థ ‘క్లౌడ్‌ఫ్లేర్’లో హోస్ట్ చేశారు. ఇతర ప్రభుత్వ వెబ్‌సైట్లను కూడా ‘క్లౌడ్’లో పెట్టడం చేయడం గమనార్హం. దీనివల్ల ఎలాంటి అదనపు నిఘా అవసరం లేకుండానే.. హ్యాకింగ్ బెడద నుంచి తప్పించుకోవచ్చనేది పాక్ సర్కారు అభిప్రాయంగా తెలుస్తోంది. క్లౌడ్‌ఫ్లేర్‌లో ఉన్నా.. ఆయా వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం పెద్ద సమస్య కాదని సైబర్‌సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అయితే.. క్లౌడ్‌ఫ్లేర్‌లో భద్రతాప్రమాణాలు ఎక్కువగా ఉంటాయని, వాస్తవ హోస్టింగ్ పాక్ సర్వర్లలోనే ఉంటాయని చెబుతున్నారు. క్లౌడ్‌ఫ్లేర్‌ను ఒక అనుబంధ హోస్టింగ్‌గా చెప్పుకోవచ్చని.. డీడాస్, ఎస్‌క్యూఎల్ దాడులు జరిపినా.. అసలైన సర్వర్‌లో ఉండే డేటాబే్‌సకు నష్టం వాటిల్లదంటున్నారు. అందుకే పాక్ సర్కారు క్లౌడ్ హోస్టింగ్‌ను ఎంచుకుని ఉంటుందని అభిప్రాయపడుతున్నారు
