Published: 26-02-2019
భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. 12 మిరాజ్-200 జైట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2ను భారత వాయుసేన విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ చేసిన ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
ఈ దాడులను పాక్ కూడా ధృవీకరించింది. ఈ దాడుల తర్వాత పాక్-భారత్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. భారత వాయుసేనపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. ఇందులో భారత వాయుసేన చేస్తున్న దాడులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
