Published: 25-02-2019

ఇక.. ఏపీకి హోదా ఎలా ఇస్తారు?

 ‘‘రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు. ప్రత్యేక హోదా ఇస్తారు అని చెబుతున్నారు. ఎలా సాధ్యం, కాంగ్రె్‌సకు 150 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 250 స్థానాలు వస్తేనే కానీ ప్రధాని కాలేరు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌-సేవ్‌ డెమోక్రసి’ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘ఇటీవల రాహుల్‌ గాంధీ కేంద్రంలో ప్రభుత్వం మారిన తరువాత ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఎలా మారుతుంది.
 
ఏ పార్టీ మద్దతు ఇస్తుంది. మీరు హోదా ఎలా ఇవ్వగలుగుతారు? అని రాహుల్‌ను ప్రశ్నించాలి, ఆంధ్రప్రదేశ్‌లో ఏడు మండలాలను విలీనం చేసిన ఘనత తనదేనని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అసలు భద్రాచలమే మనది, దానిని తప్పించి 7 మండలాలు విలీనం చేస్తే ఘనత ఏంటి? చంద్రబాబు ప్రసంగం వింటే హాయిగా నిద్రవస్తుంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది’’ అని ఉండవల్లి ఎద్దేవా చేశారు.