Published: 07-02-2019

జనసేన పార్లమెంట్ నియోజక వర్గ కమిటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ కమిటీల దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ, ప్రజల కష్టాలు ,అవసరాలు తెలుసుకున్న ఆయన, వారి కష్టాలను తీర్చగల అభ్యర్థుల ఎంపిక ఫై శ్రద్ద పెట్టారు. ఇప్పటికే స్కానింగ్ కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తూ సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడుతున్నారు.

ఇందులో భాగంగా వివిధ విభాగాలతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాలకు కమిటీలను నియమిస్తున్నారు. మంగళవారం నరసాపురం పార్లమెంట్‌కి కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా శ్రీకాకుళం, విశాఖ పట్నం, రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గాలకు కమిటీలను నియమించారు. దానికి సంబందించిన ప్రెస్ నోట్ ను విడుదల చేసారు. మీరు కూడా ఆ ప్రెస్ నోట్ చూడండి.