Published: 04-02-2019
బాధితులకు రూ.300 కోట్లు

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసి నష్టపోయిన లక్షలాది మంది కోసం రూ.250 కోట్లు కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేయనున్న రూ.250 కోట్లుకి ఇప్పటికే డిపాజిటై ఉన్న రూ.50 కోట్లు కలిపి మొత్తం రూ.300 కోట్లను బాధితులకు చెల్లించనున్నారు. ఈ నిర్ణయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లి, కోర్టు అనుమతి మేరకు బాధితులకు ప్రభుత్వం చెల్లించనుంది. ఈ విషయంలో అగ్రిగోల్డ్ కస్టమ్‌ర్స్, ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అభిప్రాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం అసోసియేషన్ నాయకులతో చర్చించనుంది.
