Published: 31-01-2019

రాజధానికి వినూత్న చల్లదనం

ఇంటింటికీ పైపుల ద్వారా మంచినీళ్లు, గ్యాస్‌ సరఫరా చేస్తున్నట్లే, ఏపీ కూడా సరఫరా చేసే రోజులు వచ్చేశాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇంటింటికీ పైపుల ద్వారా ఏసీని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ బుధవారం మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఈ విష యం తెలిపారు. దుబాయ్‌కి చెందిన తబ్రీద్‌ అనే సంస్థ నూతన రాజధానిలో ఈ సౌకర్యం కల్పించడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థతో సీఆర్‌డీఏ ఇప్పటికే దీనిపై ఒక ఒప్పందం కూడా కుదుర్చుకొంది. దుబాయ్‌లో ఇప్పటికే ఈ తరహా విధానం అమలు అవుతోంది. రాష్ట్ర ప్రభు త్వ అధికారులు అక్కడకు వెళ్లి చూసి సంతృప్తి చెందిన తర్వాత దానిని అమరావతిలో అమలు చేయడానికి పచ్చ జెండా ఊపారు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా ఈ విధానం అమల్లోకి వస్తుండటం విశేషం. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం అనే విధానం ద్వారా దీనిని అమలు చేస్తారు.
 
రెండున్నర ఎకరాల్లో ఏర్పాటయ్యే ఒక ప్లాంట్‌ సుమారుగా 500 ఎకరాల్లో నిర్మితమయ్యే భవనాలకు అవసరమయ్యే ఏసీని సరఫరా చేస్తుంది. భారీ కంప్రెసర్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. దీని నుంచి పైపుల ద్వారా చల్లదనం ఈ భవనాలకు సరఫరా అవుతుంది. అక్కడ అంతర్గతంగా నిర్మించే పైపుల ద్వారా ప్రతి గది కి చల్లదనం చేరుతుంది. ఈ విధానంలో ఈ తరహా సౌకర్యం పొందేవారు విడిగా ఏసీ యంత్రాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏసీ సరఫరా, నియంత్రణకు అవసరమయ్యే పరికరాలను మాత్రం గదుల్లో ఏర్పాటు చేసుకొంటే సరిపోతుంది. ఒక ప్లాంట్‌ ఏర్పాటుకు సుమారుగా రూ. 260 కోట్లు వ్యయం అవుతుంది. ఈ డబ్బును తబ్రీద్‌ సంస్థ తానే పెట్టుబడి పెడుతుంది. ఏసీ సరఫరా ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టుకొంటుంది.
 
భారతదేశంలో ఇప్పటివరకూ పైపులైన్‌ ఏసీ సదుపాయం గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని గిఫ్ట్‌ సిటీ అనే భ వనానికి ఉంది. 5 వేల టన్నుల ఏసీని ఈ భవనానికి సరఫరా చేస్తున్నారు. అమరావతిలో అంత కంటే భారీ గా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కో ప్లాంట్‌ 20 వేల టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు అవుతోంది. అవసరమై తే దానిని 40 వేల టన్నులకు విస్తరించగలిగే అవకా శం ఉంది. నగరంలో నిర్మాణాలు పెరుగుతున్న కొద్దీ ఇటువంటి ప్లాంట్లు మరిన్ని వ చ్చే అవకాశం ఉంది. దు బాయ్‌లో ఇటువంటి ప్లాంట్లు 90 ఉన్నాయి. దేశంలో ఇంత విస్తృత స్థాయిలో ఇటువంటి ప్లాంట్లు నవీన టెక్నాలజీతో అమరావతిలోనే ఏర్పాటు అవుతున్నాయి.