Published: 29-01-2019
ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడిన యోధుడు జార్జి

అమరావతి: కేంద్రమాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. చట్టసభల్లో కార్మికుల గళాన్ని వినిపించిన నేత జార్జి ఫెర్నాండెజ్ అని అన్నారు. దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమ నిర్మాతల్లో ఫెర్నాండెజ్ ఒకరని ఆయన తెలిపారు. ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడిన యోధుడు జార్జి ఫెర్నాండెజ్ అని కొనియాడారు. నిరాడంబరతకు, నిజాయితీకి నిదర్శనం ఫెర్నాండెజ్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జార్జి ఫెర్నాండెజ్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
