Published: 22-01-2019
మన్యాన్ని వణికిస్తున్న చలి

విశాఖపట్నం: విశాఖ మన్యంలో మరోసారి చలిపులి పంజా విసురుతోంది. దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతపల్లిలో 4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, ప్రజలు చలి తీవ్రతతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
