Published: 31-12-2018
ఏక్ భారత్‌కు నిదర్శనమే కుంభమేళా

‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’కు నిదర్శనమే కుంభమేళ అని ఉత్తరప్రదేశ్ మంత్రి సతీశ్ మహాన అన్నారు. మహాకుంభమేళ-2019 ఆహ్వాన కార్యక్రమానికి సంబంధించి ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆధ్యాత్మిక, మానవత్వ, శాంతి, పురాతన వారసత్వాల సమూహమే మహాకుంభమేళ అని, ఈ సందర్భంగా భారతదేశం మొత్తం ఒకేచోట కనిపిస్తుందన్నారు. గత కుంభమేళాకు 13 కోట్ల మంది వచ్చారని, ఈసారి 15 కోట్లు మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. కుంభమేళాకు అన్ని రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లను, కేంద్ర పాలితప్రాంతాల సీఎంలు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లను స్వయంగా ఆహ్వానిస్తున్నామని, సోమవారం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.
