Published: 30-12-2018
ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు

విజయవాడ: జనవరి ఒకటో తేదీన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. గ్రౌండ్‌లో వేదికను సిద్ధం చేస్తున్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం ఆయన మిగిలిన న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. కార్యక్రమానికి ఏపీకి కేటాయించిన న్యాయమూర్తులతోపాటు తెలంగాణకు న్యాయమూర్తులు హాజరుకానున్నారు.
