Published: 29-12-2018

మద్యం అమ్మకాలను నిషేధించాలి’

విజయవాడ: డిసెంబరు 30, 31, జనవరి 1 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శులు కసాపురం రమేష్‌, డి. రమాదేవిలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అనేక మంది యువకులు వేడుకలలో భాగంగా మద్యం తాగి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బార్‌, వైన్‌ షాపులను అన్ని కూడళ్లలో మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.