Published: 27-12-2018

చంద్రబాబు పర్యటనలో కలకలం..

అనంతపురం: ధర్మపోరాట దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనలో తాడు ఉండ కలకలం రేపింది. శిల్పారామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌, ప్రధాన రహదారి మధ్య ప్రాంతంలో తాడుతో చుట్టిన ఉండ(నాటు బాంబు మాదిరిగా) కనిపించింది. పక్కనే సున్నపు గుర్తులు ఉన్నాయి. దీన్ని చూసి కొందరు భయపడి పోయారు. ఇంతకూ అదేమిటో గుర్తించలేకపోయారు. అయితే సాధారణంగా తోటల్లో పందులను బెదరగొట్టేందుకు ఉపయోగిం చే నాటుబాంబులాగా అది ఉండడం గమనార్హం. సీఎం పర్యటనలో ఈ ఉండ కలకలం రేపింది. పోలీసుల నిఘా పటిష్టంగా ఉన్నప్పటికీ అది కనిపించడం గమనార్హం