Published: 24-12-2018
పెథాయ్ ఎఫెక్ట్..

గుంటూరు: గుండె పోటుతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన ఆదివారం చేబ్రోలు గొల్లపాలెంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... చేబ్రోలు గొల్లపాలెంకు చెందిన ఆలపాటి సుబ్బయ్య (65) కొన్నేళ్లుగా 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పెథాయ్ తుఫాన్ కారణంగా కౌలు భూమిలో పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సుబ్బయ్యకు ఆదివారం తెల్లవారు జామున గుండె పోటు రావడంతో బంధువులు చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. సాగుకు చేసిన అప్పులు తీరక, పంట పూర్తిగా డెబ్బతినడంతో ఆందోళన చెందాడు. ఆ పొలాన్ని నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రభుత్వపరంగా ఆదుకొంటామని తహసీల్దార్ సిద్ధార్థ... ఆలపాటి సుబ్బయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
