Published: 22-12-2018
మొన్న సురేష్ రెడ్డి.. నేడు లలిత

కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికలకు ముందు మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి అ నూహ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చే రగా తాజాగా ఎమ్మెల్సీ ఆకుల లలిత గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌లో చేరుతు న్నట్లు ప్రకటించారు. ఆకుల లలిత ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. దీం తో తమ దగ్గరి బంధువు నేతి విద్యాసాగర్ ద్వారా సీఎం కేసీఆర్‌ను కలిశారు. శుక్రవారం ఇతర ఎమ్మెల్సీలు సం తోష్ కుమార్, ప్రభాకర్, దామోదరరెడ్డిలతో కలిసి త మను టీఆర్‌ఎస్ లో విలీనం చే యాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖను అం దించారు. అభివృ ద్ధి పథకాలు అమ లు చేస్తున్న సీఎం కే సీఆర్ పనులను చూసే తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆమెతో పాటు ఎమ్మె ల్సీ సంతోష్‌కుమార్‌లు మీడియాకు తెలిపారు.
ఫలితాలు వెల్లడైన పది రోజులకే ఆమె టీఆర్‌ఎస్‌లో చేరడం గమనార్హం. ఆకు ల లలిత కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో పెద్ద నాయకులను కాదని ఆమె టికెట్ తె చ్చుకున్నారు. మరో మూడేళ్లు ఎమ్మెల్సీ పదవీ కాలముంది. టీఆర్‌ఎస్‌లో చేరడం కాంగ్రెస్ వర్గాలు ముందే ఊహించాయి. అయినప్పటి కీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. త్వరలో ఆమె తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాం గ్రెస్ పార్టీకి జిల్లా నుంచి ఎమ్మెల్సీ ప్రాతి ని ఽథ్యం లేకుండా పోయింది. షబ్బీర్‌అలీ పదవీ కాలం మార్చిలో ముగియనుంది. టీఆర్‌ఎస్ తరపున స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎ న్నికై కాంగ్రెస్‌లో చేరిన భూపతిరెడ్డిపై ఆ పా ర్టీ నాయకులు మండల చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నోటీసు జారీ అయింది.
