Published: 08-12-2018
రేషన్ కార్డు మంజూరుకు 1100కు ఫోన్ చేయండి

రేషన్‌కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఫోన్ ద్వారా 1100 నంబరుకు ఫోన్ చేయాలని సీఎస్‌డీటీ మహేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ముందుగా లబ్ధిదారుల పేర్లు ప్రజా సాధికారిక సర్వేలో నమోదై ఉండాలన్నారు. దాని ఆధారంగా మీ ఆధార్ నంబరుతో వారి వద్ద ఉన్న డేటాబెస్ ని పోల్చి చూస్తారన్నారు. నిబంధనల ప్రకారం అన్ని సరిగా ఉంటే దరఖాస్తుదారుడికి కొత్త రేషన్‌కార్డును జారీ చేయవచ్చని జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ)కి వివరాలు పంపుతారు. దాని నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా సంబంధిత జిల్లాలకు ఆయా వివరాలు వెళ్తాయి. అక్కడి నుంచి దరఖాస్తుదారులు మండలాలకు పంపుతారు. ఈలోపు మీ కార్డు మంజూరైందన్న సమాచారాన్ని 1100 సిబ్బంది మీ ఫోన్‌కు సమాచారం ఇస్తారు. సంబంధిత రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి కొత్తకార్డు తీసుకోవచ్చు. రేషన్‌కార్డు ఖరారు అయ్యాక దరఖాస్తుదారుడినికి 1100 సిబ్బంది ఆర్‌సీ నంబరు తెలియజేస్తారు. ఈ నెంబరుతో ఈపీడీఎస్ వెబ్‌సైట్‌లోనూ, కార్డు ప్రింట్ తీసుకునే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీనిని కొత్తగా రేషన్‌కార్డులు కావాల్సినవారు ఇప్పటికే రేషన్‌కార్డులో ఉండి వేరే కార్డు కావాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎస్‌డీటీ తెలిపారు.
