Published: 05-12-2018

ఇకపై సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే.. దర్శనం

 అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తుల్లోనే ఇంద్రకీలాద్రికి రావాల్సి ఉంటుంది. దేవస్థానం అధికారులు గతంలోనే విధించిన ఈ నిబంధనను నూతన సంవత్సరంలో కచ్ఛితంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. భారత మహిళా వన్డే క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌, ఇతర సభ్యులు శుక్రవారం జీన్స్‌ ఫ్యాంట్లు, టీ షర్టులు ధరించి రాగా, పాలకమండలి సభ్యులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకడంపై విమర్శలొచ్చాయి. దీంతో ఇక మీదట భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలనే నిబంధనను కచ్ఛితంగా అమలు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు.  జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనను కచ్ఛితంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో సంప్రదాయ దుస్తులతోనే భక్తులు దర్శనాలకు రావాలనే నిబంధనను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు.