పవన్‌కల్యాణ్‌ అక్కడెలా పోటీ చేస్తారు:

Published: 02-12-2018
రాజమహేంద్రవరం: ఆవేశమే తప్ప అవగాహన లేని నాయకుడు పవన్‌కల్యాణ్‌ అని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాడుగుల నుంచి పోటీ చేస్తానంటారు.... రెల్లికులాన్ని స్వీకరించానంటారు... కోనసీమకు రైలు మార్గం వేస్తానంటారు. ఈ మాటలన్నీ పవన్‌కల్యాణ్‌ అవగాహన రాహిత్యానికి నిదర్శమన్నారు.
 
ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానంలో పవన్‌కల్యాణ్‌ ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాకినాడ-కోటిపల్లి లైన్‌ద్వారా కోనసీమలో రైలు మార్గాన్ని వేయిస్తున్నది చంద్రబాబు అన్నారు. ఇప్పుడు కొత్తగా పవన్‌కల్యాణ్‌ రైలు మార్గాన్ని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా తెద్దాం అని చెప్పిన పవన్‌.. టీడీపీ బయటకు వచ్చాక హైదరాబాద్‌ వెళ్లి ఫామ్‌ హౌస్‌లో ఉన్నారు. ఇది అతని నాయకత్వమని ధ్వజమెత్తారు. పవన్‌కల్యాణ్‌ ఆస్థులు కాపాడుకోవడం కోసం కేసీఆర్‌తో రాజీ పడ్డారు. చిత్తశుద్ధితో వాస్తవాన్ని ఎత్తి చూపితే...అప్పుడు ప్రభుత్వం ఆ లోపాన్ని సరిచేసేందుకు చూస్తుందన్నారు. అలా కాకుండా సినిమాలాగ వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని అని గోరంట్ల అన్నారు