జగన్ విచక్షణ, వివేకం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు

Published: 18-11-2018

విజయవాడ: కోడి కత్తి ఘటన జరిగిన 23 రోజుల తర్వాత జగన్‌కు బయటకు వచ్చి మాట్లాడటం ఏంటని మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్తే పెట్టి కేస్ పట్టుకుని వచ్చారని అడగలేదా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం, డీజీపీలను ఏ1, ఏ2 అంటావా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విచక్షణ, వివేకం లేకుండా బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారన్నారు. సీఎం అయిపోయాననే భ్రమ నుంచి జగన్‌ బయటకు రావాలని వ్యాఖ్యానించారు. జగన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని మంత్రి దేవినేని అన్నారు.