నన్నపనేనికి ‘డిప్లోపియా’ సమస్య!

Published: 16-09-2018

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి డిప్లోపియా అనే సమస్యతో బాధపడుతున్నారు. నియంత్రణలో లేని అధిక రక్తపోటు కారణంగా కంటి నరం బలహీనపడటంతో దృష్టి సమస్యలు ఏర్పడ్డాయి. ప్రతి వస్తువు రెండుగా కనిపించడం డిప్లోపియా వ్యాధి లక్షణం. దీంతో ఆమె కొద్దిసేపు కూడా టీవీ, దినపత్రికలు చూడలేకపోతున్నారు. విపరీతమైన తలనొప్పి, చూపు మసక బారడంతో ఆమె పది రోజులుగా గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.