ప్రతిపక్షం కోసం కాదు...ప్రజల కోసం.....

Published: 07-09-2018

అమరావతి: ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ బాగా జరిగిందనే పేరు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రతిపక్షం కోసం మనం పనిచేయడం లేదు...ప్రజల కోసం పనిచేస్తున్నా’మని తెలిపారు. ప్రజలు అన్నింటిని నిశితంగా గమనిస్తున్నారన్నారు. ఎందుకు సభకు వెళ్లరని వైసీపీని ఉపాధ్యాయులు నిలదీశారని...అందుకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారని చెప్పారు. అన్నివర్గాల ప్రజల్లో ప్రతిపక్షంపై తీవ్ర వ్యతిరేకత ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.