ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారు
Published: 17-08-2018

రాజకీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నాయని సీబీఐ మాజీ జేడీ లక్మ్షీనారాయణ అన్నారు. విజయనగరంలో ప్రజా చైతన్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అధికారంలోకి వచ్చిన నాయకులు నిధులు స్వాహా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చె య్యాలన్న సంకల్పంతో వందేమాతరం పౌరసేవా కేంద్రాలు స్థాపిస్తున్నామని తెలిపారు. వీటిని 72వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరంతో పాటు మరికొన్ని జిల్లాల్లో స్థాపించామని చెప్పారు. విశ్రాంత ఉద్యోగులు, యువత ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని.. పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే నిరక్ష్యరాస్యులకు వీరు సహకరిస్తారని పేర్కొన్నారు

Share this on your social network: