టీడీపీ నేతలపై దివ్యాంగుడి ఆరోపణలు

Published: 05-08-2018

తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలపై ఓ దివ్యాంగుడు సంచలన ఆరోపణలు చేశాడు. మూడేళ్లుగా తనకు ఇల్లు, రుణం మంజూరు కాకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని దివ్యాంగుడు శివరావు ఆరోపిస్తున్నారు. పెరవలి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన శివరావు సోషల్‌ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. నాకు న్యాయం చేయకపోతే సాయంత్రంలోగా ఆత్మహత్యకు పాల్పడతానంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. టీడీపీ నేతలు నాకు ఇల్లు, రుణం మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.