పవన్‌ కల్యాణ్‌కు హెచ్చరించారు.

Published: 28-07-2018

జనసేనపార్టీ నాయకులు జగన్‌ గురించి మాట్లాడడం తగదని రైల్వేకోడూరు వైసీపీ పట్టణ కన్వీనర్‌ సీహెచ్‌రమేష్‌బాబు, నియోజకవర్గ అధికారప్రతినిధి మందలనాగేంద్ర, జిల్లా స్టీరింగ్‌కమిటీసభ్యులు నందాబాల తెలిపారు. శుక్రవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జనసేన నాయకుడిది చంచలమైన మనస్థత్వంఅని, అవిశ్వాసతీర్మానం రోజున 150మంది ఎమ్మెల్యేలను తీసుకునివెళ్లి ప్రత్యేకహోదాకోసం ఆమరణదీక్ష చేస్తామని చెప్పి జనసేన అధినేత దానిపై అసలు మాట్లాడడంలేదని ఆరోపించారు. ఇప్పుడే జనంలోకి వచ్చిన పవన్‌కళ్యాణ్‌ ఏమితెలుసునని ప్రశ్నించారు. జగన్‌వెంట అన్నికులాలు, మతాలు ఉన్నాయని చట్టసభలపై వైసీపీకి గౌరవం ఉందన్నారు. ఒళ్లుదగ్గరపెట్టుకుని మాట్లాడితే చాలామంచిదని లేకుంటే భారీగా మూల్యం చెల్లించాల్సివస్తుందని హెచ్చరించారు.