పవన్ కల్యాణ్ పార్ట్‌టైమ్ పొలిటీషియన్
Published: 07-04-2022

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఫుల్‌టైమ్ పొలిటీషియన్ కాదని, పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. సెక్రటేరియట్‌లో గురువారం జరిగిన కేబినేట్ సమావేశంలో మంత్రుల రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి పేర్ని సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన అనంతరం టీడీపీతో కలిసి కాపురం చేశారన్నారు. అనంతరం బీజేపీతో ముందుకెళ్లారన్నారు. ఆ తరువాత సీపీఎం, సీపీఐలతో కలిసి పనిచేస్తామని చెప్పి మధ్యలోనే విడాకులు ఇచ్చారన్నారు. పూలే, చేగువేరా ఫొటోలు కూడా ఎక్కడికిపోయాయో తెలియవన్నారు. మళ్లీ ఇప్పుడు బీజేపీ రూట్ మ్యాప్ కోసం పవన్ ఎదురుచూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చే అంత సామర్థ్యం పవన్‌కు లేదన్నారు.

Share this on your social network: